కోపమున ఘనత కొంచెమైపోవును 
కోపమునను గుణము కొరతపడును 
కోపమణచనేని కోరికలీడేరు 
విశ్వదాభిరామ వినురవేమ

తాత్పర్యము

కోపం వల్ల మనిషి తన కీర్తిని తానే తగ్గించుకుంటాడు. ఉన్న కొద్ది సుగుణం కోపం వల్ల తక్కువైపోతుంది. కోపాన్ని అణుచుకుంటే లక్ష్యాల సాధన సులభమవుతుంది. అందుకే శాంతమే శ్రీరామరక్ష.