జాణలమని యంద్రు చపలాత్ములగువారు
తెలివిలేక తమ్ముతెలియలేరు
కష్టమైన యడవి గాసీలుచున్నారు
విశ్వదాభిరామ వినురవేమా!
తాత్పర్యము
ప్రజలు తమను తాము తెలివిగలవారమనుకుంటారు. తమలోని అజ్ఞానాన్ని గ్రహించరు. తమను తాము తెలుసుకోలేని వారు తపస్సు చేసినా సరైన ప్రయోజనాన్ని పొందక, సారాన్ని గ్రహించలేక అడవుల్లో నివసిస్తూ పలు కష్టాలపాలవుతుంటారు.