తనగుణము తనకు నుండగ

తనగుణము తనకు నుండగ 
నెనయంగా నోరుని గుణము నెంచును మదిలో 
దన గుణము తెలియ కన్యుని 
బనిగొని దూషించువాడు వ్యర్థుడు వేమా! 

తాత్పర్యము

మంచివో చెడ్డవో, తన గుణాలను తాను చూడకుండా ఇతరుల గుణాలను ఎంచుట, తనను తాను గమనింపక ఇతరులను దూషించుట తగదు. అలా చేయువాడు వ్యర్థుడు.