తెలుగు బిడ్డ
ద్వారంబంధమునకు దలుపులు గడియలు వలెనె నోటికొప్పుగల నియతులు ధర్మమెరిగి పలుక ధన్యుండౌ భువిలోన విశ్వదాభిరామా వినురవేమ
ద్వారానికి తలుపులు గడియలు ఉన్నట్లే మాటకు కూడా నియమములు రక్షణలై కలవు. ధర్మమెరిగి తగినట్లు మాట్లాడినవాడే ధన్యుడు, ఉత్తముడగును