దశగలారినెల్ల దమ బంధువు లటండ్రు 
దశయలేమి నెంత్రు తక్కువగను 
దశయన గమ ధన దశమొక్కటే దశ 
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యము

ఎవరి దగ్గరైనా ధనం ఉంటేనే వారిని తమ వారని చెప్పుకోడానికి ఇష్టపడతారు. డబ్బు లేకపోతే ఎంత మంచివారినైనా తమ బంధువులని చెప్పుకోరు. మనుషుల మంచితనానికంటే డబ్బుకే విలువఇస్తారు. ధనం ఉంటేనే అదృష్టం అని భావిస్తారు.