తెలుగు బిడ్డ
నరుడెయైన లేక నారాయణుండైన తత్త్వబద్ధుడైన దరణి నరయ మరణమున్నదనుచు మదిని నమ్మగవలె విశ్వదాభిరామా వినురవేమ
మానవుడైన, దానవుడైనా, తత్త్వవేత్తయైనా, ఇంకెవరైనా సరే శరీరధారికి మరణమనేది తప్పనేతప్పదని గ్రహించవలెను