పతక మందు నొప్పు పలు రత్నముల పెంపు
బంగరందు కూర్ప బరువు గనును
గాని యితర లోహమైన హీనము గాదె
విశ్వదాభిరామ వినురవేమ!
తాత్పర్యము
రత్నాల అందం బంగారు అభరణాల్లో పొదిగితేనే తెలుస్తుంది. ఇతర లోహాల్లో అమర్చితే ఎంతమాత్రం శోభను చేకూర్చదు. మంచివాళ్లకు చెడ్డవారికి కూడా భేదం ఇలాగే ఉంటుంది.