బొంది యెవరి సొమ్ము పోషింపబలుమారు
ప్రాణ మెవరి సొమ్ము భక్తిసేయ,
ధనమదెవరిసొమ్ము ధర్మమె తన సొమ్ము
విశ్వదాభిరామ వినురవేమ
తాత్పర్యము
ఎంతటి బలమైన ఆహారం పెట్టి పోషించినా శరీరం శాశ్వతం కాదు. ఎవరి ప్రాణాలు శాశ్వతం కాదు. డబ్బు కూడా నిలవదు. ఎన్నిటికైనా మనం చేసిన దానధర్మాలే నిలిచి ఉంటాయి. అందుకే అందరూ ధర్మబుద్ధిని కలిగి ఉండాలి.