భూమిలోన బుట్టు భూసారమెల్లను
తనువులోన బుట్టు తత్త్వమెల్ల
శ్రమలోన బుట్టు సర్వంబు తానౌను
విశ్వదాభిరామ వినురవేమ
తాత్పర్యము
ఈ ప్రపంచం నుంచే సమస్త చరాచర జీవకోటి జన్మిస్తుంది. మానవుడి ఉనికిలో నుంచే చైతన్యం ఉద్భవిస్తుంది. శ్రమలో నుంచే సర్వం ఉత్పన్నమవుతుంది. శ్రమించనిదే సృష్టిసాగదు. శ్రమంలో నుంచే సంపద వస్తుంది.