telugubidda.in
పురికిని బ్రాణము కోమటి వరికిని బ్రాణంబు నీరు వసుమతిలోనం గరికిని బ్రాణము తొండము సిరికిని బ్రాణము మగువ సిద్ధము సుమతీ!
ఈ లోకంలో పట్టణానికి వైశ్యుడు, వరిసస్యమునకు నీళ్లు, ఏనుగుకు తొండము, ఐశ్వర్యానికి స్త్రీ జీవం ఒసంగుదురు.