తెలుగు బిడ్డ
చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవైన యట్లు పామరుఁడు దగన్ హేమంబుఁ గూడఁబెట్టిన భూమీశులపాఁ జేరు భువిలో సుమతీ!
చీమలు పెట్టిన పుట్టలు పాములకు నివాసమైనట్లు అజ్ఞాని కూడబెట్టిన బంగారమంతా రాజుల వశమై పోతుంది.