గుజరాత్ అసెంబ్లీకి తొలి విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. గురువారం జరిగే పోలింగ్‌లో రాజధాని అహ్మదాబాద్ సహా 12 జిల్లాలలోని 87 నియోజకవర్గాలలో 1.81 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో సౌరాష్ట్రలోని ఏడు, దక్షిణ గుజరాత్‌లోని నాలుగు జిల్లాలు ఉన్నాయి. సురేంద్ర నగర్, రాజ్‌కోట్, జామ్‌నగర్, పోర్‌బందర్, అమ్రెలీ, భావ్‌నగర్ నియోజకవర్గాలు ఈ విడతలో అత్యంత కీలకమైనవి.

2012-12-13