Latest posts
-
ఇంట్లో ఇత్తులు లేవూ, ఇద్దఱికీ మాటలు లేవు. (భార్యాభర్తలకు)
ఇంట్లో ఇత్తులు లేవూ, ఇద్దఱికీ మాటలు లేవు. (భార్యాభర్తలకు)
-
ఇంటెద్దుకు బాడిగలేదు.
ఇంటెద్దుకు బాడిగలేదు.
-
ఇంటిసొమ్ము విప్ప పిండి, పొరుగింటి సొమ్ము పొడిబెల్లం.
ఇంటిసొమ్ము విప్ప పిండి, పొరుగింటి సొమ్ము పొడిబెల్లం.
-
ఇంటివారు వేలు చూపితే బయటివారు కాలుచూపుతారు.
ఇంటివారు వేలు చూపితే బయటివారు కాలుచూపుతారు.
-
భాగ్యనగరం
ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం హైదరాబాద్. దీనిని భాగ్యనగరం అని కూడా పిలుస్తారు. క్రీస్తుశకం 1591లో మహ్మద్‌కులీకుతుబ్ షా దీనిని నిర్మించాడు. కుతుబ్ షాహీ వంశంలో ఆయన అయిదో రాజు. ఈ నగరానికి 400ఏళ్ల చరిత్ర ఉంది. నగర చరిత్రకు చార్మినార్, గొల్కొండ కట్టడాలు మకుటాయమానం. ప్రత్యేక రాజ్యంగా అనేక ఏళ్లు వర్థిల్లిన హైదరాబాద్ ఎట్టకేలకు 1948 సైనిక చర్య తర్వాత భారత్‌లో అంతర్భాగమైంది. హైదరాబాద్-సికింద్రాబాద్ జంటనగరాలుగా ప్రసిద్ధికెక్కాయి. ప్రస్తుతం నగరం గ్రేటర్ హైదరాబాద్‌గా విస్తరిస్తోంది. పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా,…
-
సాహిత్య విమర్శకుడుగా గురజాడ
‘కన్యాశుల్కం’ నాటకం ఇవాల్టికీ గురజాడ కళా సృష్టికి దర్పణంగా నిలుస్తోంది. ‘ముత్యాల సరాలు’ ఛందస్సులో ఆయన తెచ్చిన గొప్ప మార్పుకి ప్రతీకగా నిలుస్తోంది. ‘తెలుగు కవిత్వంలో నేను కొత్త, ఎక్స్పెరిమెంట్ ఆరంభించాను. నా ముత్యాల సరాల రీతిని మీరు గమనించినట్లయితే మీకే ఈ విషయం ధృవపడుతుంది… నా మొదటి గేయంలో సాధ్యమైనన్ని వాడుక మాటలను, గ్రాంధిక వ్యాకరణ సూత్రాలకు, లేదా ప్రాచీన కవుల పద్ధతులకు ఒదగని శబ్దాలను ప్రయోగించాను’ అని ఆయన ఒక లేఖలో రాశారు. నాటక…
-
భిన్నపార్శ్వాల గురుజాడ
నేడు గురజాడ అప్పారావు గారి 150వ జయంతి జాతీయతాస్ఫూర్తి భారత దేశమంతటా వెల్లివిరుస్తున్న రోజుల్లో కలం పట్టిన యోధుడు గురజాడ. పాశ్చాత్య నాగరికత వ్యామోహంలో పడి భారత యువత కొట్టుమిట్టాడుతున్న సమయంలో వారికి భారతీయ సంస్కృతి, చరిత్ర, సాహిత్య వైభవాలను గుర్తుచేయడంతోపాటు పాశ్చాత్య లోకానికి భారతీయ ఔన్నత్యాన్ని తెలియజేయాల్సిన చారిత్రక అవసరాన్ని గుర్తించిన దీర్ఘదర్శి- గురజాడ. రెండు పరస్పర విరుద్ధ సంస్కృతుల మధ్య సంఘర్షణ జరుగుతున్న రోజులవి. దాని దుష్ఫలితాలను గుర్తించని కారణంగా సనాతనవాదులైన దేశీయ…
-
వినాయక చవితి శుబాకాంక్షలు
తెలుగు వారందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ పర్యావరణానికి అనుకూలమైన మట్టి వినాయకుడినే పూజించమని మనవి
-
బండెనుక బండి కట్టి… పదహారు బండ్లు కట్టి
బండెనుక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లె వస్తవ్ కొడుకో నైజాము సర్కరోడా నాజీల మించినవ్ రో నైజాము సర్కరోడా పోలీసు మిలిట్రి రెండు బలవంతులనుకోని నువ్వు పల్లెలు దోస్తివి కొడుకో మా పల్లెలు దోస్తివి కొడుకో నైజాము సర్కరోడా స్త్రీ పురుషులంత గలిసి ఇల్లాలమంత గలిసి వడిసేల రాళ్లు గట్టి వడివడిగ గొట్టితేను కారాపు నీళ్లు దెచ్చి కండ్లళ్ల జల్లితేను నీ మిలిట్రి బారిపొయెరో నీ మిలిట్రి బారిపొయెరో… నైజాము…
-
తెలంగాణ విమోచనానికి 64 ఏళ్లు
భూమి కోసం… విముక్తి కోసం తెలంగాణా ప్రజలు సాగించిన పోరాటానికి ఫలితం దక్కిన రోజు. భూస్వాముల అరాచకత్వం… నిజాం నిరంకుశ పాలనను నిరసిస్తూ తెలంగాణా జనం ఏకమై కదం తొక్కారు. నాలుగున్నర వేల మంది ప్రాణాలు కోల్పోయినా మడమ తిప్పకుండా తెగువ చూపారు. రజాకారుల దుశ్చర్యలకు ఎదురొడ్డి సాగించిన ఆనాటి సాయుధ పోరాటానికి నిజాం నవాబు తలవంచక తప్పలేదు. వందల ఎకరాలను తన ఆధీనంలో ఉంచుకుని జనాన్ని నరకయాతన పెడుతున్న భూస్వాములకు వ్యతిరేకంగా మొదలైన నాటి…