పలుదోమి సేయు విడియము
తలగడిగిన నాఁటినిద్ర తరుణులయెడలం
బొలయలుక నాటి కూటమి
వెల యింతని చెప్పరాదు వినురా సుమతీ!
తాత్పర్యము:
దంతధావనం చేసుకుని, తలంటు పోసుకుని, తాంబూలం వేసుకుని పోయిన నిద్ర, స్త్రీలతో ప్రణయకలహం వచ్చిన రోజు పొందు అత్యంత సౌఖ్యప్రదాలు. వాటి విలువ ఇంతని చెప్పలేము.