పర్వముల సతులఁ గవయకు

పధ్యం:: 

పర్వముల సతులఁ గవయకు
ముర్వీశ్వరుకరుణ నమ్మి యబ్బకు మదిలో
గర్వింపనాలి బెంపకు
నిర్వహణము లేనిచోట నిలువకు సుమతీ

తాత్పర్యము: 
పుణ్యదినాల్లో స్త్రీలతో కలవకుము. ప్రభువుల దయను నమ్మి మనసులో ఉప్పొంగకుము. గర్వంతో విర్రవీగే భార్యను పోషింపకు. సాగుదల లేనిచోట నిలవకు.