పతికడకుఁ దన్నుగూర్చిన

పధ్యం:: 

పతికడకుఁ దన్నుగూర్చిన
సతికడకును వేల్పుకడకు సద్గురు కడకున్
సుతుకడకు రిత్తచేతుల
మతిమంతులు చనరు నీతిమార్గము సుమతీ!

తాత్పర్యము: 
ప్రభువు వద్దకు, భార్య దగ్గరికి, భగవంతుని సన్నిధానానికి, గురువు వద్దకు, కుమారుని దగ్గరకు బుద్ధిమంతులు వట్టిచేతులతో వెళ్లరు. ఇదియే నీతిమార్గము.