ధనపతి సఖుఁడై యుండియు నెనయంగా శివుఁడు భిక్షమెత్తగవలసెన్ దనవారి కెంతకల గిన దనభాగ్యమె తనఁకుగాక తథ్యము సుమతీ!