తాను భుజింపని యర్థము

పధ్యం:: 

తాను భుజింపని యర్థము
మానవపతిఁ జేరుఁగొంత మరి భూగతమౌఁ
గానల నీఁగల గూర్చిన
దేనియ యెరుఁజేరునట్లు తిరగమున సుమతీ!

తాత్పర్యము: 
అరణ్యంలో తేనెటీగలు కూడబెట్టిన తేనె కడకి తరుల పాలైనట్లు లోభి నోరు కట్టుకొని కూడబెట్టిన ధనం కొంత ప్రభువుల పాలును, మరికొంత భూమి పాలగును.