తన కలిమి ఇంద్రభోగము
తన లేమియె సర్వలోక దారిద్య్రంబున్
తన చావు జతద్ప్రళయము
తను వలచినదియె రంభ తథ్యము సుమతీ!
తాత్పర్యము:
తన ఐశ్వర్యమే దేవలోక వైభవం; తన దారిద్య్రమే సమస్తలోక దారిద్య్రం; తన చావే ప్రపంచానికి ప్రళయం; తాను ప్రేమించినదే రంభ; మనుషులు భావించేది ఈ విధంగానే... ఇది నిజము.