తనయూరి తపసితనమును దనపుత్త్రుని విద్య పెంపుఁ దన సతి రూపున్ దన పెరటిచెట్టు మందును మనసున వర్ణింప రెట్టి మనుజులు సుమతీ!