ఆదాయ వ్యయాలు సరిచూసుకొనే సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. అలాగే పడిన శ్రమకు దక్కిన ఫలితానికి సరిపోయిందని చెప్పే సందర్భాలలో కూడా ఈ జాతీయ ప్రయోగం వాడకంలో ఉంది. ప్రమిదలో దీపం వెలిగించేందుకు వేసిన వత్తి, పోసిన చమురు సరితూకంగా ఉన్నాయని చెబుతూనే అంతరార్థంగా ఆదాయ వ్యయాలను వత్తి, చమురులతో పోల్చటం ఇక్కడ విశేషం.
సేకరణ: ఈనాడు.నెట్