Latest posts

  • శతక సాహిత్యం

    శతకము అనగా వంద పద్యాలతో రచించే ఒక సాహితీ ప్రక్రియ. శతక సాహితీ ప్రక్రియలో ఒకటే మకుటము గల పద్యాలు కనీసం వంద వ్రాస్తారు. భర్తృహరి వ్రాసిన సుభాషిత త్రిశతి సంస్కృతములో ప్రసిద్ధి చెందినది. "ఆంధ్ర వాఙ్మయమున శాఖోపశాఖలుగా వికాసమునందిన కావ్య ప్రక్రియలలో శతకమొకటి. ప్రాకృత, సంస్కృత ప్రక్రియలననుసరించియే తెలుగు శతక రాచనమారంభమై, కాలక్రమమున విశిష్ట సాహితీ ప్రక్రియగా రూపొందినది. తెలుగులో పన్నెండో శతాబ్దంలో శతకమావిర్భవించినది. ఈ ఎనిమిది వందల యేండ్లలో తెలుగు శతకం శాఖోపశాఖలుగా విస్తరిల్లిస్వరూపంలోనూ…

    Read more

  • శ్రీరాముని దయచేతను

    శ్రీరాముని దయచేతను నారూఢిగ సకలజనులు నౌరాఁయనగా ధారాళమైన నీతులు నోరూరఁగఁ జవులుపుట్ట నుడివెద సుమతీ! తాత్పర్యము మంచిబుద్ధి గలవాడా! శ్రీరాముని దయవల్ల నిశ్చయముగా అందరు జనులనూ శెభాషని అనునట్లుగా నోటి నుంచి నీళ్లూరునట్లు రసములు పుట్టగా న్యాయమును బోధించు నీతులను చెప్పెదను.

    Read more

  • అక్కరకు రాని చుట్టము

    అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునఁదా నెక్కినఁ బారని గుర్రము గ్రక్కున విడువంగ వలయుఁ గదరా సుమతీ! తాత్పర్యము అవసరమునకు పనికిరాని చుట్టమును, నమస్కరించి వేడిననూ కోరిక నెరవేర్చని భగవంతుని, యుద్ధ సమయమున ఎక్కినప్పుడు ముందుకు పరిగెత్తని గుర్రమును వెంటనే విడిచిపెట్టవలయును.

    Read more

  • అడిగిన జీతంబియ్యని

    అడిగిన జీతంబియ్యని మిడిమేలపు దొరనుగొల్చి మిడుకుటకంటెన్ వడిగల యెద్దుల గట్టుక మడి దున్నుకు బ్రతుకవచ్చు మహిలో సుమతీ! తాత్పర్యము అడిగినప్పుడు జీతమును ఈయని గర్వి అయిన ప్రభువును సేవించి జీవించుట కంటే, వేగముగా పోగల ఎద్దులను నాగలికి కట్టుకుని పొలమును దున్నుకొని వ్యవసాయం చేసుకోవడం మంచిది.

    Read more

  • అడియాస కొలువుఁ గొలువకు

    అడియాస కొలువుఁ గొలువకు గుడిమణియము సేయఁబోకు కుజనులతోడన్ విడువక కూరిమి సేయకు మడవినిఁదో డరయఁకొంటి నరుగకు సుమతీ! తాత్పర్యము వృథా ప్రయాస అగు సేవను చేయకుము. గుడి ధర్మకర్తృత్వమును చేయకుము. చెడ్డవారితో స్నేహము చేయకుము. అడవిలో సహాయం లేకుండా ఒంటరిగా పోకుము.

    Read more

  • అప్పుగొని సేయు విభవము

    అప్పుగొని సేయు విభవము ముప్పునఁ బ్రాయంపుటాలు మూర్ఖుని తపమున్ దప్పురయని నృపురాజ్యము దెప్పరమై మీఁదఁ గీడు దెచ్చుర సుమతీ! తాత్పర్యము రుణము తెచ్చుకొని అనుభవించు సౌఖ్యము, ముసలితనంలో పడుచు భార్య, తప్పులను కనిపెట్టని రాజు రాజ్యము సహింపరానివి. చివరకు హాని కలిగించేవి.

    Read more

  • అల్లుని మంచితనంబును

    అల్లుని మంచితనంబును గొల్లని సాహిత్యవిద్య, కోమలి నిజమున్ బొల్లున దంచిన బియ్యముఁ దెల్లని కాకులును లేవు తెలియర సుమతీ! తాత్పర్యము అల్లుడి మంచితనం, గొల్లవాని పాండిత్యజ్ఞానం, ఆడదానియందు నిజం, పొల్లు ధాన్యములో బియ్యం, తెల్లని కాకులూ లోకములో ఉండవు.

    Read more

  • ఆఁకొన్న కూడె యమృతము

    ఆఁకొన్న కూడె యమృతము తాఁకొందక నిచ్చువాఁడె దాత ధరిత్రిన్ సోఁకోర్చువాఁడె మనుజుఁడు తేఁకువగలవాఁడె వంశ తిలకుఁడు సుమతీ! తాత్పర్యము లోకంలో ఆకలి వేసినప్పుడు అన్నమే అమృతము, బాధ పొందకుండా ఇచ్చువాడే దాత, ఆవేశాన్ని ఓర్చుకొనేవాడే మానవుడు, ధైర్యం కలవాడే వంశశ్రేష్ఠుడు.

    Read more

  • ఇమ్ముగఁ జదువని నోరును

    ఇమ్ముగఁ జదువని నోరును అమ్మాయని పిలిచి యన్నమడుగని నోరున్ దమ్ములఁ బిలువని నోరును గుమ్మరిమను ద్రవ్వినట్టి గుంటర సుమతీ! తాత్పర్యము ఇంపుగా పఠింపని నోరు, అమ్మా అని పిలిచి అన్నం అడగని నోరు, తమ్ముడూ అని పిలవని నోరు కుమ్మరివాడు మన్ను తవ్విన గోయితో సమానం సుమా!

    Read more

  • ఉడుముండదె నూరేండ్లును

    ఉడుముండదె నూరేండ్లును బడియుండదె పేర్మి బాము పదినూరేండ్లున్ మడుపునఁ గొక్కెర యుండదె కడు నిల బురుషార్థపరుడు గావలె సుమతీ! తాత్పర్యము ఉడుము నూరేళ్లు, పాము పది వందల ఏళ్లు, కొంగ చెరువులో చిరకాలం జీవిస్తున్నాయి. వాటి జీవితాలన్నీ నిరుపయోగాలే. మానవుని జీవితం అలా కాక ధర్మార్థకామమోక్షాసక్తితో కూడినది కావాలి.

    Read more