Latest posts

  • తిరుపతిలో ఘనంగా నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలు

    తెలుగుకు వరాభిషేకం జరిగింది. అమ్మ భాషపై కానుకల జల్లు కురిసింది. తిరుపతిలో గురువారం అట్టహాసంగా ప్రారంభించిన 'నాలుగో ప్రపంచ తెలుగు మహాసభల' వేదికపై నుంచి భాషాభివృద్ధికి తోడ్పాటును అందించే దిశగా ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పలు వరాలను గుప్పించారు. తెలుగు భాష, సంస్కృతికి ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు సంగీత, నాటక, సాహిత్య, లలితకళల అకాడమీలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి పదో తరగతి దాకా కచ్చితంగా తెలుగుభాష బోధనను చేపట్టాలని…

    Read more

  • కాకతీయుల వైభవం

      రుద్రదేవ మహారాజు కాకతీయ సామ్రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా నెలకొల్పి ఈ ఏటికి 850 సంవత్సరాలు, కాకతీయ మహా సామ్రాజ్ఞి రుద్రమదేవి పట్టాభిషేకం జరిగి ఈ ఏటికి 750 సంవత్సరాలు, హనుమకొండలో  వేయి స్థంబాల గుడి నిర్మించి ఈ ఏటికి 850 సంవత్సరాలు, అంతే కాదు పాలం పేటలోని ప్రసిద్ద రామప్ప దేవాలయం నిర్మించి కూడా ఈ ఏటికి 800 సంవత్సరాలు.. అలనాటి స్వర్ణయుగ వైభవానికి ప్రతీక.. శిల్పకళా సౌందర్యానికి నిలయం.. సాహితీ వేత్తల సౌరభాలు గుబాళించిన…

    Read more

  • తెలుగు యునికోడ్ ఖతులు (ఫాంట్స్)

    ఇప్పుడు తెలుగులో కొత్త యునికోడ్ ఖతులు(fonts) అందుబాటులో ఉన్నాయి .. ఇవి ఆంధ్రపదేశ్ రాష్ట్ర ప్రబుత్వం అందుబాటులో ఉంచింది.. ఈ ఖతులను మీ కంప్యూటర్ లో నిక్షిప్తం చేసుకొని వాడుకోవచ్చు.. వివరాలకు ఈ క్రింది లంకెను చూడండి http://teluguvijayam.org/fonts.html   ఖతి  పేరు నమూనా లంకెలు దిగుమతికై లంకెలు ఖతి నమూనా దిగుమతి కై (to Download) ఖతి నమూనా దిగుమతి కై (to Download) ఖతి నమూనా దిగుమతి కై (to Download) ఖతి నమూనా…

    Read more

  • తరతరాల తెలుగుదనం… కోల్పోతున్నాం మనం

    మేల్కోవాల్సిన తరుణం     కోతికొమ్మచ్చులు, గోటింబిళ్లలు, గోదారీతలు, ఇసుకగుళ్లు, పాకంజీళ్లు, పప్పుబెల్లాలు, తొక్కుడుబిళ్లలు, వామనగుంటలు, వల్లంకి పిట్టలు, పట్టుపరికిణీలు, వెండిపట్టీలు, వైకుంఠపాళీలు, రుక్మిణీ కల్యాణాలు… ఏమయ్యాయి ఇవన్నీ? ఇవి అంతరించడం అంటే తెలుగుదనం అంతరించడం కాదూ? మనిషి పుట్టుకకు ముందే మాతృభాషతో బంధం మొదలవుతుంది. అమ్మ మాట్లాడుతున్న చిన్న చిన్న మాటలను కడుపులోని బిడ్డ గ్రహించి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుందని, అలా అమ్మభాషను తన భాషగా సొంతం చేసుకునేందుకు ఆయత్తమవుతుందని శాస్త్రవేత్తలు నిరూపించారు. ఎంతమందిలో ఉన్నా అమ్మ…

    Read more