Latest posts

  • గుణములోగలవాని కులమెంచగానేల

    గుణములోగలవాని కులమెంచగానేల  గుణము కలిగెనేని కోటిసేయు  గణములేక యున్న గుడ్డిగవ్వయులేదు  విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము గుణవంతుడి కులాన్ని ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ధనవంతుడు కాకపోయినా గుణం ఉంటే చాలు. గుణహీనుడు చిల్లిగవ్వ విలువ కూడా చేయడు.

    Read more

  • శుభముల నొందని చదువును

    శుభముల నొందని చదువును అభినయమున రాగరసము నందని పాటల్ గుభగుభలు లేని కూటమి సభమెచ్చని మాటలెల్లఁ జప్పన సుమతీ! తాత్పర్యము శుభాలు పొందని విద్య, నటన, సంగీత, సామరస్యంతో కూడిన పాటలు, సందడి లేని కలయిక, సభల్లో మెప్పు పొందని మాటలు రుచించవు. చప్పనయినవి.

    Read more

  • సరసము విరసము కొరకే

    సరసము విరసము కొరకే పరిపూర్ణ సుఖంబు అధిక బాధల కొరకే పెరుగుట విరుగుట కొరకే ధర తగ్గుట హెచ్చుకొరకే తధ్యము సుమతీ! తాత్పర్యము హాస్యపు మాటలు విరోధము కొరకే. సంపూర్ణ సౌఖ్యాలు విస్తారమైన బాధల కోసమే. పొడవుగా ఎదుగుట విరిగిపోవడానికే. ధరవరలు తగ్గడం మళ్లీ పెరగడానికే అని మనుషులు తెలుసుకోవాలి.

    Read more

  • మేలెంచని మాలిన్యుని

    మేలెంచని మాలిన్యుని మాలను నగసాలివాని మంగలి హితుగా నేలిన నరపతి రాజ్యము నేలఁగలసిపోవుగాని నెగడదు సుమతీ! తాత్పర్యము ఉపకారాన్ని గుర్తుంచుకోని దుర్మార్గుడ్ని, పంచముని, కంసాలివానిని, మంగలిని హితలుగా చేసుకొని పాలించే రాజు రాజ్యము మట్టిలో కలిసి నాశనం అవుతుంది కానీ కీర్తిని పొందదు.

    Read more

  • సిరి దా వచ్చిన వచ్చును

    సిరి దా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్ సిరి దాఁ బోయిన బోవును కరిమింగిన వెలగపండు కరణిని సుమతీ! తాత్పర్యము సంపద వచ్చినప్పుడు కొబ్బరికాయలోకి నీరు వచ్చిన విధంగా రమ్యంగానే ఉంటుంది. అలాగే పోయినప్పుడు ఏనుగు మింగిన వెలగపండులో గుంజు మాయమైనట్లే పోతుంది.

    Read more

  • స్త్రీల ఎడ వాదులాడక

    స్త్రీల ఎడ వాదులాడక బాలురతో జెలిమిచేసి భాషింపకుమీ మేలైన గుణము విడువకు ఏలిన పతి నిందసేయ కెన్నడు సుమతీ! తాత్పర్యము స్త్రీలతో ఎప్పుడూ గొడవపడద్దు. చిన్నపిల్లలతో స్నేహం చేసి మాట్లాడవద్దు. మంచి గుణాలను వదలవద్దు. యజమానిని దూషించవద్దు.

    Read more

  • కొండముచ్చు పెండ్లికి కోతి పేరంటాలు

    కొండముచ్చు పెండ్లికి కోతి పేరంటాలు  మొండి వాని హితుడు బండవాడు  దుండగీడునకును కొండెడు దళవాయి  విశ్వదాభిరామా వినురవేమ తాత్పర్యము కొండముచ్చు పెళ్లికి కోతి పేరంటాలైనట్లు మొండివానికి బండవాడు మిత్రుడైనట్లు. దుర్మార్గునకు అబద్దాలకోరు సహాయపడును.

    Read more

  • కనులు పోవువాడు కాళ్లు పోయినవాడు

    కనులు పోవువాడు కాళ్లు పోయినవాడు  ఉభయులరయుగూడి యుండినట్లు  పేద పేద గూడి పెనగొని యుండును  విశ్వదాభిరామా వినురవేమ తాత్పర్యము కుంటి, గుడ్డి పరస్పరము సాయపడునట్లు బీదవానికి బీదవాడే సాయపడును. సజ్జనుడు సజ్జనునే చేరును.

    Read more

  • కలిమిగల్గనేమి కరుణ లేకుండిన

    కలిమిగల్గనేమి కరుణ లేకుండిన  కలిమి తగునె దుష్టకర్ములకును  తేనెగూర్పనీగ తెరువున బోవదా  విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము సంపద ఉన్నా, జాలి, దయ లేకపోతే ఆ సంపద నశిస్తుంది. తేనేటీగలు కూర్చిన తేనే ఆ ఈగలకు దక్కని విధంగా దుష్టుల సంపదలు కూడా వారికి దక్కవు.

    Read more

  • కదలనీయకుండ గట్టిగా లింగంబు

    కదలనీయకుండ గట్టిగా లింగంబు  కట్టివేయనేమి ఘనత కలుగు  భావమందు శివుని భావించి కానరా  విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము పెద్ద శివలింగాన్ని కదలకుండా మెడలో కట్టుకుంటే ఎలాంటి ప్రయోజనం లేదు. మనస్ఫూర్తిగా శివుడిని ధ్యానించి సేవిస్తే చాలు.

    Read more