Latest posts
-
ఆంద్రప్రదేశ్ అవతరణ దినోత్సవం
నవంబర్ 1 వ తేదీ అంటే ఇవాళ ఆంద్ర ప్రదేశ్ అవతరణ దినం. 1953 వ సంవత్సరం ఇదే రోజు పదకొండు తెలుగు మాట్లాడే జిల్లాలు కలిసి ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాయి. అంతకు ముందు ఇవి మద్రాస్ రాష్ట్రంలో ఉండేవి. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు పనిచేసారు. అనంతరం 1956 నవంబర్ ఇదే రోజున నిజాం పాలనలో ఉన్న తెలంగాణా ప్రాంతాన్ని ఆంద్ర ప్రదేశ్ లో విలీనం చేసారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం:…
-
రావి నారాయణరెడ్డి
రావి నారాయణరెడ్డి, కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణ పోరాటంలో ముఖ్యుడు. 1908 జూన్ 4న జన్మించాడు. ఆంధ్ర మహాసభకు ఆధ్యక్షుడుగా పని చేశారు. తెలంగాణ విమోచన తరువాత ఆయన సిపిఐలో చాలాకాలం పని చేశారు. రావి నారాయణరెడ్డి విశాలాంధ్ర కోసం ఎంతో శ్రమించారు. నిజాం ప్రభుత్వం మీద ఆయన చేసిన సాయుధ పోరాటం చిరస్మరణీయం. 1946-48 కాలంలో హైదరాబాదు సంస్థానంలో నిజాం పోలీసుల దాష్టీకానికి, మతదురహంకారులైన రజాకార్ల ఆగడాలను అరికట్టడ్డడానికి అజ్ఞాతంగా ఎన్నో గెరిల్లా దళాలను ఏర్పాటుచేసినారు. 1952లో…
-
దామోదరం సంజీవయ్య
దామోదరం సంజీవయ్య, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి మరియు తొలి దళిత ముఖ్యమంత్రి. సంయుక్త మద్రాసు రాష్ట్రములో, ఆంధ్ర రాష్ట్రములో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మరియు కేంద్ర ప్రభుత్వములో అనేక మార్లు మంత్రి పదవిని నిర్వహించాడు. రెండుసార్లు అఖిల భారత కాంగ్రేస్ కమిటీ అధ్యక్షుడు అవడము కూడా ఈయన ప్రత్యేకతల్లో ఒకటి. ఈయన కాంగ్రేసు పార్టీ తొలి దళిత అధ్యక్షుడు కూడా. 38 సంవత్సరాల పిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన ఘనత ఈయనకే దక్కింది. పారిశ్రామికాభివృద్దికి…
-
మన తెలుగు గురించి మీకు తెలుసా ??
12వ శతాబ్ధిలో పాల్కురికి సోమనాధుడు "నవలక్ష తెలుంగు" – అనగా తొమ్మిది లక్షల గ్రామ విస్తీర్ణము గలిగిన తెలుగు దేశము – అని వర్ణించాడు. అచ్చుతో అంతమయ్యే విషయం వల్ల ఇది సంగీతపరంగా సంగీతకారులకు చాలా ఇష్టమైన భాష. పురాతత్వ పరిశోధనల ప్రకారము తెలుగు భాష ప్రాచీనత 2400 సంవత్సరాలనాటిది క్రీ.పూ.700 ప్రాంతంలో వచ్చిన ఐతరేయ బ్రాహ్మణము (ఋగ్వేదములో భాగము)లో మొదటిసారిగా "ఆంధ్ర" అనే పదం జాతి పరంగా వాడబడింది. క్రీ.పూ. 4వ శతాబ్ధిలో మెగస్తనీసు అనే…