Latest posts
-
పద్మనాభం
పద్మనాభం! తెలుగు తెర హాస్య నటశ్రేణిలో అగ్రగణ్యుడు. రెండు మూడు దశాబ్దాల పాటు ప్రేక్షక జనాన్ని నవ్వుల జల్లుల్లో తడిపిన నట ప్రముఖుడు. అనేకానేక చిత్రాలు నిర్మించి విజయాలూ ప్రశంసలూ పొందిన విలక్షణ కళాభిజ్ఞుడు. అనేకమంది కొత్తవారిని పరిచయం చేసి సినీజీవితం అందించిన అనుభవశాలి. శ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రం ద్వారా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను గాయకునిగా పరిచయం చేసిన ఘనత పద్మనాభానిదే కెవిరెడ్డి, బిఎన్‌రెడ్డి వంటి మహోన్నత దర్శకుడిని అందించి కడపజిల్లానుంచి తారాపథానికి చేరిన కొద్దిమంది…
-
హాస్యనట చక్రవర్తి “రాజబాబు”
తెలుగు సినీ వినీలాకాశంలో తనదైన హాస్యనటనతో అలరించి విభిన్నమైన శైలిలో ఓ ప్రత్యేకముద్రను వేసి మనందరి మదిలో చిరకాలం గుర్తిండిపోయే హాస్యనట చక్రవర్తి రాజబాబు. తన నటనా వైదుష్యంతో, సమాజంలో తోటి మనుషులకు సాయపడే ధర్మగుణంతో తనజీవితాన్ని సార్థకం చేసుకొన్న నవ్వులరేడు వరుసగా ఏడుసార్లు ఫిలింఫేర్ అవార్డులు తీసుకున్న మొదటి కమెడియన్ రాజబాబు. మనిషి జీవితంలో వచ్చే పలు ఒత్తిడులు, అశాంతి నుండి బయటపడి మనశ్శాంతిగా, ఆనందంగా ఉంచగలిగే సున్నితమైన ఆయుధం హాస్యం అని చెప్పొచ్చు. ఈ…
-
భానుమతీ రామకృష్ణ
"మల్టీ ఫేసేటేడ్ క్వీన్ అఫ్ ఇండియన్ సినెమా" అన్న ఒక్క మాటలో భానుమతి గారికి చక్కగా నిర్వచనం ఇచ్చారు ఎవరోగాని. ఒక వ్యక్తిలో సంగీతం, సాహిత్యం, నటనా వైదుష్యం,కార్య నిర్వహణా దక్షత, దర్శకత్వ ప్రతిభా, ఎడిటింగ్ నైపుణ్యం, పాటలు వ్రాయడం, సంగీతం సమకూర్చడం, స్టూడియో నిర్వహణా, మంచితనం, మానవత్వం, ధైర్యం –ఇలా అన్నన్ని సుగుణాలు ఎలావచ్చాయో అని ఆలోచిస్తే అది భగవద్దత్తం అని అనిపించక మానదు. భారతదేశం గర్వంచదగ్గ నటీమణుల్లో ఆమె ఒకరు. నటిగానే కాకుండా గాయనిగా,…
-
మాధవపెద్ది సత్యం
రంగస్థల అనుభవం ఆయన్ని తీర్చిదిద్దింది పద్యం ఆయన గళంలో వయ్యారాలు పోయింది దుర్యోధనుడు, రావణుడు, ఘటోత్కచుడు…. ఇలా ఎన్నో పాత్రలకు ఆయన కంఠం జీవం పోసింది ఎస్వీరంగారావు, రేలంగి, రమణారెడ్డి …… ఇలా ఎందఱో నటులకు ఆయన కంఠం అమరి పోయింది పాట ఆయన గొంతులో ఒదిగిపోయింది పాడుతున్నది పాత్రలేమోననిపిస్తుంది పాడుతున్నది పాత్రదారులేమోననిపిస్తుంది వారిలో ఆయన స్వరం పరకాయ ప్రవేశం చేస్తుంది ఆయన పద్యంలో భావం తొణికిసలాడుతుంది ఆయన పాటలో రాగం అలవోకగా అమరిపోతుంది ఆయన కంఠంలో…
-
అన్నగారు, విశ్వ విఖ్యాత నటసార్వభౌమ “ఎన్.టి.ఆర్”
మదరాసులో ఆయన వుండగా తిరుపతి వెళ్ళిన తెలుగు యాత్రీకులు ఒక మొక్కుబడిగా మదరాసు వెళ్ళి ఉదయమే ఆయనను దర్శించుకుని వచ్చేవారు. తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు నందమూరి తారక రామారావు. తెలుగుజాతికీ, తెలుగుభాషకూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. హైదరాబాదు లోని హుస్సేన్‌సాగర్ కట్టపై ( ట్యాంకుబండ్) సుప్రసిద్ధులైన తెలుగువారి విగ్రహాలు నెలకొల్పాడు. “నక్సలైట్లు కూడా దేశభక్తులే బ్రదర్” అంటూ నినదించి, సైనిక దుస్తులు వేసుకుని, తెలుగువారి కీర్తి…