Latest posts

  • డా.భోగరాజు పట్టాభి సీతారామయ్య

    భోగరాజు పట్టాభి సీతారామయ్య  స్వాతంత్ర్య సమరయోధుడు, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు.  డాక్టర్‌గా తెలుగు భాషాభిమానిగా, ఖద్దరు దారిగా, స్వాతంత్య్ర సమరశీలిగా, మహాత్మాగాంధీకి ఆప్తునిగా, రాజకీయ చతురునిగా, నిరంతర ప్రజా సేవకునిగా, ముక్కుసూటి మనిషిగా మన్ననలందుకొన్నారు సీతారామయ్య. సామాన్య ప్రజలకు బ్యాంకులు అందుబాటులో లేని రోజుల్లో, అప్పులకోసం అన్నదాతలు ఎదురు తెన్నులు చూస్తున్న రోజుల్లో వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం ఆంధ్రా బ్యాంక్‌ను స్థాపించారాయన. 1906లో మచిలీపట్నంలో వైద్యవృత్తిని చేపట్టారు. గాంధీజీ పిలుపు…

    Read more

  • దామోదరం సంజీవయ్య

    దామోదరం సంజీవయ్య, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి మరియు తొలి దళిత ముఖ్యమంత్రి. సంయుక్త మద్రాసు రాష్ట్రములో, ఆంధ్ర రాష్ట్రములో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మరియు కేంద్ర ప్రభుత్వములో అనేక మార్లు మంత్రి పదవిని నిర్వహించాడు. రెండుసార్లు అఖిల భారత కాంగ్రేస్ కమిటీ అధ్యక్షుడు అవడము కూడా ఈయన ప్రత్యేకతల్లో ఒకటి. ఈయన కాంగ్రేసు పార్టీ తొలి దళిత అధ్యక్షుడు కూడా. 38 సంవత్సరాల పిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన ఘనత ఈయనకే దక్కింది. పారిశ్రామికాభివృద్దికి…

    Read more

  • శ్రీ పనప్పాకం ఆనందాచార్యులు

    తొలితరం జాతీయ కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఒకరు పనప్పాకం ఆనందాచార్యులు. అఖిల భారత జాతీయ కాంగ్రెసు అధ్యక్షులు. బొంబాయిలో జరిగిన కాంగ్రెస్ సభకు హాజరైన 72 మంది ప్రతినిధుల్లో ఆనందాచార్యులు ఒకరు.   పనప్పాకం ఆనందాచార్యులు, చిత్తూరు జిల్లాకు చెందిన కడమంచి గ్రామంలో 1843 సంవత్సరంలో జన్మించారు. వీరి తండ్రి శ్రీనివాసాచార్యులు. వీరు చిత్తూరు జిల్లా కోర్టులో ఉద్యోగం చేశారు. తండ్రి మరణానంతరం ఆతని మిత్రుడైన సి. వి. రంగనాథ శాస్త్రులు సహాయంలో 1863లో మెట్రిక్యులేషన్, తర్వాత మద్రాసు…

    Read more