Latest posts
-
అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను
అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు మోగినట్లు కనకంబు మోగునా విశ్వదాభిరామ వినుర వేమ! తాత్పర్యము అల్పుడెప్పుడు మాట్లాడినా ఆడంబరంగానే ఉంటుంది. అదే సజ్జనుడు మాట్లాడితే చల్లగా నిరాడంబరంగా ఉంటుంది. కంగున మోగి విలువలేని ఇత్తడిలాగా అనవసరమైన హడావిడి చేసేవారు అల్పులు. శబ్దం రాకపోయినా బంగారం లాగా విలువైన వాడు సజ్జనుడు.
-
అతిథి రాక చూచి యదలించి పడవైచి
అతిథి రాక చూచి యదలించి పడవైచి కఠిన చితులగుచు గానలేరు కర్మమునకు ముందు ధర్మము గానరో విశ్వదాభిరామ వినురవేమా! తాత్పర్యము అతిథి ఇంటికి రాగానే అతనిని అదిలించి పొమ్మని చెప్పిన కఠినచిత్తులు ధర్మమును గుర్తింపరు.ధర్మము చేసిననే కర్మములు నశించగలవు
-
అన్నదానమునకు నధిక సంపదగల్గి
అన్నదానమునకు నధిక సంపదగల్గి యమరలోక పూజ్యుడగును మీఱు అన్నమగును బ్రహ్మమది కనలేరయా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము అన్ని దానాలలోకి అన్నదానం గొప్పది. ఆ దానాన్ని మించిన దానం లేదు. అన్నదానం చేస్తే దేవలోక పూజలు అందుకుంటాడు. అన్నం పరబ్రహ్మ స్వరూపం.
-
అర్ధ యంకణమున కాధారమైనట్టి
అర్ధ యంకణమున కాధారమైనట్టి యొంటిమేడ గుంజు నొనరనిల్పె నింటికొక మగండె యిల్లాండ్రునేద్గురు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము దేహం ఒంటి స్తంభపు ఇల్లులాంటిది. దానికి జీవుడు ఒక్కడే యజమాని. కానీ ఇల్లాళ్ళు మాత్రం ఏడుగురు. వారే సప్తప్రకృతులు