Latest posts
-
శ్రీ పనప్పాకం ఆనందాచార్యులు
తొలితరం జాతీయ కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఒకరు పనప్పాకం ఆనందాచార్యులు. అఖిల భారత జాతీయ కాంగ్రెసు అధ్యక్షులు. బొంబాయిలో జరిగిన కాంగ్రెస్ సభకు హాజరైన 72 మంది ప్రతినిధుల్లో ఆనందాచార్యులు ఒకరు. పనప్పాకం ఆనందాచార్యులు, చిత్తూరు జిల్లాకు చెందిన కడమంచి గ్రామంలో 1843 సంవత్సరంలో జన్మించారు. వీరి తండ్రి శ్రీనివాసాచార్యులు. వీరు చిత్తూరు జిల్లా కోర్టులో ఉద్యోగం చేశారు. తండ్రి మరణానంతరం ఆతని మిత్రుడైన సి. వి. రంగనాథ శాస్త్రులు సహాయంలో 1863లో మెట్రిక్యులేషన్, తర్వాత మద్రాసు…