అనువుగాని చోట అధికులమనరాదు కొంచెముందుటెల్ల కొదువకాదు కొండ యద్దమందు కొంచమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమ
తగనిచోట తాము గొప్పవారమని చెప్పరాదు. కొంచెం వారైన మాత్రాన హాని లేదు. పెద్దకొండ అద్దంలో చిన్నదిగా కనిపించును కదా.