తెలుగు బిడ్డ
ఎండిన మా నొకటడవిని మండిన నందగ్ని పుట్టి యూడ్చును చెట్లన్ దండిగల వంశమెల్లను చండాలుండొకడు పుట్టి చదుపును వేమా!
ఎండిన మ్రాను అడవిలో ఉన్నచో అందుకు పుట్టిన అగ్ని వనమునంతయున కాల్చును. వంశములో ఒక నీచుడు పుట్టి ఆ వంశమునంతను నశింపజేయును.