ఐకమత్యమొక్క టావశ్యకం బెప్డు 
దాని బలిమి నెంతయైన గూడు 
గడ్డి వెంట బెట్టి కట్టరా యేనుంగు 
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యము

ఐకమత్యం ఎంతో ముఖ్యమైనది. దానిలో ఎంతో బలం ఉంది. గడ్డి పరకలను ఒక్కటిగా చేర్చి ఏనుగును కూడా బంధించవచ్చు. ఐకమత్యంగా ఉంటే ఎంతని కార్యాన్నయినా సాధించవచ్చు.