తెలుగు బిడ్డ
కనులు పోవువాడు కాళ్లు పోయినవాడు ఉభయులరయుగూడి యుండినట్లు పేద పేద గూడి పెనగొని యుండును విశ్వదాభిరామా వినురవేమ
కుంటి, గుడ్డి పరస్పరము సాయపడునట్లు బీదవానికి బీదవాడే సాయపడును. సజ్జనుడు సజ్జనునే చేరును.