జనన మరణములన స్వప్న సుషుప్తులు

జనన మరణములన స్వప్న సుషుప్తులు 
జగములందు నెండ జగములుండు 
నరుడు జగమునంట నడుబాటు కాదొకో 
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యము

చావు పుట్టుకలు స్వప్నాలలోని అవస్థలలాంటివి. ప్రపంచం ఎండమావులలోని నీటిలాంటి మిథ్య, ప్రపంచ భోగాలలో చిక్కుకొని తప్పించుకోలేక అల్లాడడం వివేకవంతులకు అవమానకరం.