నోరు పలకవచ్చు నుడి వ్రాయగరాదు

నోరు పలకవచ్చు నుడి వ్రాయగరాదు 
వ్రాతకన్న సాక్షి వలవదన్న 
పరగలేని వ్రాత భంగ పాటుందెచ్చు 
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యము

ఎన్ని మాటలైనా చెప్పవచ్చు కానీ రాసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడే మాటలకన్నా రాత గొప్ప సాక్ష్యం. అవాస్తవాలను, కల్పితాలను రాయడం వల్ల మోసమే జరుగుతుంది.