పండువలన బుట్టె బరగ ప్రపంచము
పండువలన బుట్టె పరము నిహము
పండు మేలెఱింగె బ్రహ్లాదుడిలలోన
విశ్వదాభిరామ వినురవేమ
తాత్పర్యము
భగవంతుడు ప్రకృతి నుంచి జన్మించాడు. భగవంతుడు ఈ లోకాలను సృష్టించాడు. ఇన్ని లోకాలను సృష్టించిన భగవంతుడి గొప్పతనం ప్రహ్లాదుడి వంటి భక్తులు మాత్రమే తెలుసుకోగలిగారు.