పుట్టు పుట్టలేదే పుడమిని జనులెల్ల
పుట్టి గిట్టలేదె పూర్వులెవరు
పుట్టి గిట్టుటెల్ల వట్టి భ్రాంతులు సుమీ,
విశ్వదాభిరామ వినుర వేమా!
తాత్పర్యము
పుట్టిన వారికి చావు తప్పదు. చావక బతికి ఉన్నవారు ఎవరూ లేరు. చావు, పుట్టుకలు భ్రాంతులు. అందుకే పుట్టుకపై ఆశతో భోగభాగ్యాలపై లాలసత్వం పెంచుకోకూడదు. చచ్చిపోతామనే భయంతో నిత్యం ఆవేదన చెందకూడదు.