భయమంతయు దేహమునకె 
భయ ముడిగిన నిశ్చయంబు పరమాత్మునకే 
లయమంతయు జీవునకే 
జయమాత్మకు ననుచు జగతిఁ జాటుర వేమా

తాత్పర్యము

సంశయం, భయం అన్నీ శరీరానికే. వాటిని విడిచి పెడితే ఆత్మ సాక్షాత్కారమవుతుంది. లయము పొందేది జీవుడే. ఆత్మ నిత్యమైనది. దానినెప్పుడు విజయం వరిస్తుంటుంది.