వెన్న చేతబట్టి వివరంబు తెలియక 
ఘృతము కోరునట్టి యతని భండి 
తాను దైవమయ్యు దైవంబు దలచును 
విశ్వదాభిరామ వినురవేమ! 

తాత్పర్యము

వెన్నను చేతలో పట్టుకుని నెయ్యి చేసే విధానము తెలియక నేతికై బాధపడే వానివలె, జనుడు తనలోనే భగవంతుడున్నాడని తెలుసుకోలేక అతనెక్కడో ఉన్నాడని వెదకుచూ తికమక పడుతుంటాడు.