వ్రాతకంటె హెచ్చు పరమీదు దైవంబు
చేతకంటె హెచ్చు వ్రాత లేదు
వ్రాత కజుడు కర్త చేతకు దాకర్త
విశ్వదాభిరామ వినురవేమ!
తాత్పర్యము
చేసుకున్న దానికన్నా చిన్నమెత్తు దేవుడు కూడా ఇవ్వలేడు. దీనినే లోకులు బ్రహ్మవాతలంటారు. తల వ్రాతకు బ్రహ్మదేవుడు కర్త కావచ్చు గానీ, తన చేతకు నరుడు తానే కర్త.