తెలుగు బిడ్డ
శాంతమే జనులను జయమునొందించును శాంతముననె గురువు జాడ తెలియు శాంత భావ మహిమ జర్చింపలేమయా విశ్వదాభిరామ వినురవేమ!
శాంత స్వభావం ఉంటే దేనినైనా సాధించవచ్చు. శాంతంతోనే గురువులు గొప్పవారయ్యారు. శాంత గుణం మహిమను వర్ణించలేము.