భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు
దాన హీనుఁ జూచి ధనము నవ్వు
కదన భీతుఁ జూచి కాలుఁడు నవ్వును
విశ్వదాభిరామ వినురవేమ
తాత్పర్యము:
శాశ్వతంగా భూమిపై జీవించలేని మానవుడు ఈ భూమి నాది... నాది అంటే భూమి నవ్వుతుంది.దానం చేయని వాడిని చూసి ధనం నవ్వుతుంది. యుద్ధమంటే పారిపోయే వాడిని చూసి యముడు కూడా నవ్వుతాడు.