యోగిననుచు గొంత యోగముగూర్చక

పధ్యం:: 

యోగిననుచు గొంత యోగముగూర్చక 
జగమునెల్లబట్ట చంపి తినుచు 
ధనము కొఱకు వాడు తగవాడుచుండిన 
యోగికాడు వాడె యోగువేమ

తాత్పర్యము: 
యోగి అని ప్రకటించుకొని అందరినీ పీడించేవాడు ఎన్నటికీ యోగి కాలేడు. డబ్బు కోసం ఇతరులను బాధించేవాడు ఎందుకూ పనికిరానివాడే అవుతాడు.