కొన్న దగ్గర కొసరు కానీ కోరిన దగ్గర కొసరా అన్నట్టు

ఒకరిని యాచించేటప్పుడు లేదా కోరి అడిగి తీసుకొనేటప్పుడు ఇచ్చిన దాంతో తృప్తిపడాలి. అంతేకానీ ఇంకా ఇవ్వు ఇంకా ఇవ్వు అని కొసరటం పద్ధతి కాదు. డబ్బులు పెట్టి కొనేటప్పుడు కొసరినా బాగుంటుంది కానీ అడిగి తీసుకొనేటప్పుడు ఇచ్చిన దాంతో తృప్తి పడాలన్న సామాజిక జీవన విధానాన్ని తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది.

మూలం/సేకరణ: 
eenadu.net