ఇదిగో దున్న అంటే అదిగో వెన్న అన్నట్టు

ఎవరేం చెబితే దాన్ని గుడ్డిగా నమ్మటం, దాన్నే ప్రచారం చేయటం చాలా సందర్భాలలో లోకసహజంగా కనిపిస్తుంది. అలా అమాయకంగా నమ్మి ఎవరైనా నమ్మినదాన్ని ప్రచారం చేస్తున్నప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. అదిగో పులి అనంటే ఇదిగో తోక అనేలాంటిదే ఇది. దున్న పాలివ్వదు. పాలుంటేనే వెన్న వస్తుంది. కానీ కొంతమంది మోసగాళ్లు ఈ దున్న పాలిస్తుంది అని మోసపు మాటలు చెప్పి నమ్మిస్తున్నప్పుడు అమాయకులు దాన్ని నమ్మి ఆ పాలనుంచి వెన్న కూడా ఇంకెవరో తీశారని, తాము చూశామని ప్రచారం చేస్తుంటారు. ఇటువంటి మోసపూరిత ఘటనల బారిన పడినవారి గురించి తెలియ చెప్పేటప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది.

మూలం/సేకరణ: 
eenadu.net