ఆకారానికి మాత్రమే గంభీరంగా ఉండి వ్యవహారంలో తీసివేతగా ఉండే వ్యక్తులను గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. కాగితంలో చేసిన పులిబొమ్మ, ఏకులతో చేసిన ఏనుగు బొమ్మ ఆకారానికి మాత్రమే ఆ జంతువులను పోలి ఉంటాయి. అంతేకానీ ఆ జంతువుల్లాగా క్రూరంగానూ, బలంగానూ ఉండటం జరగదు. ఈ భావన ఆధారంగా డాంబికాలకుపోతూ కార్యశూన్యులై తిరిగేవారి గురించి చెప్పేందుకు ఈ జాతీయం అవతరించింది.