ఎద్దు ఎండకు దున్న నీడకు లాగినట్లు..

సరిపోని జోడి, కలయిక కలవని మనస్తత్వాలు అనే లాంటి అర్థాలలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. బండికి ఓ వ్యక్తి ఓ వైపు ఎద్దును, మరోవైపు దున్నను కట్టాడట. ఎద్దు ఒక వైపునకు, దున్న మరో వైపునకు బండిని లాగుతూ ఉంటే ఆ బండి ప్రయాణం ఎలా ఉంటుందో ఎవరైనా వూహించవచ్చు. అలాగే భిన్న స్వభావాలున్న మనుషులు ఒకచోట చేరి భిన్న అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ జరగాల్సిన పనిని జరగనివ్వనప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది.

మూలం/సేకరణ: 
eenadu.net