ఇర్రికొమ్ము అంటే బర్రెకొమ్ము అన్నట్టు..

చెప్పిన దానికి విరుద్ధంగా ప్రవర్తించటం, ఒకపని చేయమంటే మరోలా అర్థం చేసుకొని వేరే ఏదోపని చేయటం అనేది కొంతమంది దగ్గర కనిపిస్తుంటుంది. అలాంటి వారిని గురించి చెప్పేటప్పుడు 'ఇర్రి కొమ్ము అంటే బర్రెకొమ్ము అంటాడు. వీడితో కలిసి ఎలా ప్రయాణం చేయాలో ఏమిటో మరి' అనేలాంటి ప్రయోగాలున్నాయి. ఇర్రి అంటే జింక, బర్రె అంటే గేదె అని అర్థం.

మూలం/సేకరణ: 
eenadu.net