ఇంట ఆచారత్వం, బయట బడా చోరత్వం..

పైకి ఒకలాగా లోలోపల మరొలాగా ప్రవర్తించేవారుంటారు. అలాంటి వారిని గురించి చెప్పాల్సివచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. ఆచారత్వం, చోరత్వం అనే పదాలను ప్రాస కోసమో, తూగు కోసమో వాడినా అంతరార్థం మాత్రం ముక్కుసూటిగా తప్పును విమర్శించినట్టే ఉంటుంది. ఆచారాలు పాటిస్తున్నాను మీరూ పాటించండి అని చెప్పేవారు వేరొకచోటికి వెళ్లిన తరువాత ముందు చెప్పిన దానికి విరుద్ధంగా నీతినియమాలను పాటించకుండా అడ్డదిడ్డంగా వ్యవహరిస్తున్నప్పడు అలాంటివారిని ఈ జాతీయంతో వ్యవహరిస్తుంటారు.

మూలం/సేకరణ: 
eenadu.net