ఏ వయస్సుకు ఆ ముచ్చటంటారు. ముద్దు ముచ్చట్లన్నీ యుక్తవయస్సులో ఉన్నప్పుడైతే చూడటానికి బాగుంటుందేమో కానీ వయస్సు మీరిన తర్వాత అవి అంతగా బాగుండవు. వయ్యారంగా ఉండటమనేది వయస్సులో ఉన్నవారికైతే చక్కగానే ఉంటుంది. వయస్సు మీరినవారు వయ్యారాలు పోతే అందరూ వెక్కిరించే పరిస్థితి ఏర్పడుతుంది. అలా ఎవరైనా తమ వయస్సుకు తగ్గ పనులు కాక వేరేలాగ ప్రవర్తిస్తున్నప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది.